ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'9 నెలల పాలనలో కక్షపూరిత రాజకీయాలే తప్ప అభివృద్ధి లేదు' - పురందేశ్వరి తాజా న్యూస్

వైకాపా, తెదేపాలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని భాజపా నాయకురాలు పురందేశ్వరి తెలిపారు. జనసేనతో కలిసే స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. 9 నెలల వైకాపా ప్రభుత్వ పాలనలో కక్షపూరిత రాజకీయాలే తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు.

purandeshwari
'9 నెలల పాలనలో కక్షపూరిత రాజకీయాలే తప్ప అభివృద్ధి లేదు'

By

Published : Feb 18, 2020, 8:19 PM IST

రాష్ట్రాన్ని వైకాపా ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందన్న భాజపా నేతలు

9 నెలల వైకాపా పాలనలో కక్షపూరిత రాజకీయాలు తప్ప.. అభివృద్ధి జరగలేదని భాజపా నేత పురందేశ్వరి విమర్శించారు. వైకాపా, తెదేపాలు రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని ఆమె అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరులో జరిగిన భాజపా జోనల్ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ కొద్దినెలల పాలనలోనే రాష్ట్రంలో 40 వేల కోట్లు అప్పు సృష్టించారని దుయ్యబట్టారు. ఆర్థికలోటుతో సతమతమవుతున్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని వైకాపా ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. వైకాపాతో కానీ, తెదేపాతో కానీ భాజపాకు ఎలాంటి పొత్తూ లేదని పురందేశ్వరి స్పష్టం చేశారు. జనసేనతో అవగాహన ఉంది కాబట్టి వారితో కలిసే స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు.

ఇవీ చూడండి:

'ప్రజలకు ఉపయోగపడే పథకాలను రద్దు చేశారు'

ABOUT THE AUTHOR

...view details