వామపక్ష, కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సాగింది.
నెల్లూరు..
నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగాా 'దేశవ్యాప్త బంద్' - CAA NRC LATEST NEWS
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు చోట్ల సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టారు.
ఆత్మకూరు...
కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ ఆత్మకూరులో కార్మిక సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ నుంచి గాంధీ బోమ్మ వరకు ప్రదర్శన చేపట్టాయి. కనీస వేతనాలతో పాటు కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉదయగిరి....
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరిలో బంద్ సాగింది. రోడ్లకు అడ్డంగా బల్లలను ఉంచి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బంద్ కారణంగా ఉదయగిరిలో దుకాణాలు మూత పడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
నాయుడుపేట....
నాయుడుపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. స్థానిక మార్కెట్ సెంటర్ కార్యాలయం నుంచి పుర వీధుల్లో నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. కనీస వేతనాలు. నిత్యావసర సరుకుల ధరలను కట్టడి చేయాలని... పెట్రోలు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి కల్పించాలని కోరుతూ మానవహారం చేపట్టారు.
ఇదీచూడండి.కామాంధులను శిక్షించాలని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన గ్రామస్థులు