భర్త ఇంటి ముందు నిరసనకు దిగిన భార్యపై అత్తింటివారు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని దుర్గమ్మకాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
మరో మహిళతో వివాహేతర సంబంధం..
దుర్గమ్మకాలనీలో నివసించే వినయ్ కుమార్కు అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామానికి చెందిన శ్రీలక్ష్మీతో అయిదేళ్ల క్రితం వివాహమైంది. 5 లక్షల రూపాయల నగదు, పదిహేను సవర్ల బంగారమిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అప్పటికే మద్యానికి భానిసైన వినయ్ వివాహమైన కొన్ని రోజులకే అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడని బాధితురాలు చెబుతోంది. తనకు బాబు పుట్టిన తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయని, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను ఇంటి నుంచి గెంటేశారని ఆవేదన వెలిబుచ్చింది.