Nellore Crime News: నెల్లూరు నగరంలో పట్టపగలే దారుణం జరిగింది. జనం రద్దీగా ఉండే టౌన్ హాల్ ఎదురుగా దండువారి వీధిలో విజయ్(21) అనే వ్యక్తిపై ముగ్గురు యువకులు కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తం మడుగులో ఉన్న అతన్ని స్థానికులు, స్థానిక వన్‌టౌన్ సీఐ వీరేంద్రబాబు సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విజయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నెల్లూరులో పట్టపగలే దారుణం.. కత్తులతో యువకుడిపై దాడి - నెల్లూరులో పట్టపగలే కత్తులతో దాడి
Murder Attempt at Nellore: నెల్లూరు నగరం ఉల్లిక్కి పడింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ యువకుడిపై కత్తులతో దారుణంగా పొడిచి పరారయ్యారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
పట్టపగలే నగరం నడిబొడ్డున ఈ ఘటన జరగడంతో జిల్లాలో కలకలం రేగింది. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలో ఆధారంగా నిందితుల వివరాలు సేకరిస్తున్నారు. దాడికి గురైన యువకుడు విజయ్.. పట్టణలోని మనుమసిద్ధి నగర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఎవరితోనూ పెద్దగా విభేదాలు లేనప్పటికీ.. ఈ దారుణం జరగడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పాతకక్షల వల్ల ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరేంద్రబాబు చెప్పారు.
ఇదీ చదవండి: