ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Armed Forces Flag Day: 'జవాన్ల త్యాగం మరువలేనిది.. వారి సంక్షేమం కోసం కృషి చేద్దాం' - నెల్లూరు జిల్లాలో సాయుధ దళాల పతాక దినోత్సవం

Armed Forces Flag Day At Nellore: సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యుద్ధ వీరులు, వారి కుటుంబ సభ్యులను సత్కరించారు. దేశ భవిష్యత్, రక్షణ కోసం పాటుపడుతున్న జవానుల సంక్షేమం కోసం కృషి చేద్దామని కలెక్టర్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు.

నెల్లూరు కలెక్టరేట్​లో సాయుధ దళాల పతాక దినోత్సవం
నెల్లూరు కలెక్టరేట్​లో సాయుధ దళాల పతాక దినోత్సవం

By

Published : Dec 8, 2021, 10:55 AM IST

Armed Forces Flag Day At Nellore: దేశం కోసం అమరులైన జవాన్లను ప్లాగ్‌ డే నాడు స్మరించుకుంటూ.. వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ విరాళాలు ఇవ్వాలని ప్రజలకు నెలూరు జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. సాయుధ దళాల పతాక దినోత్సవం, ఇండో-పాక్‌ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో యుద్ధ వీరులు, వారి కుటుంబ సభ్యులను సత్కరించారు.

నెల్లూరు కలెక్టరేట్​లో సాయుధ దళాల పతాక దినోత్సవం

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భావి భారత పౌరుల్లో దేశభక్తి, దేశ సమగ్రతపై గౌరవాన్ని పెంపొందించేందుకు ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ తదితర కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా సైనిక సంక్షేమ నిధికి విరాళం అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో ఓబులేసు, జిల్లా సైనిక సంక్షేమాధికారి పీఎస్‌ రమేష్‌, మాజీ సైనిక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details