ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీసీడ్స్.. విత్తనాల రవాణాకు ఆర్టీసీ కార్గో సేవలు

ఆర్టీసీ..రోజూ లక్షల మందిని తమ గమ్యస్థానాలు చేర్చే ప్రజారవాణా. కరోనా ప్రభావంతో జనం ఆర్టీసీ ప్రయాణానికి అంతగా మొగ్గుచూపడం లేదు. ప్రయాణికులు లేక ఆర్టీసీ నిర్వహణ భారమైంది. ఆ నష్టాల్ని కొంత మేర తగ్గించుకునేందుకు ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేట్​ గూడ్స్​ను తరలిస్తుంది. రైతన్నలకు ఖరీఫ్ సీజన్​కు అందించే విత్తనాల సరఫరాకు ఏపీ సీడ్స్.. ఈ సేవలను వినియోగించుకుంటుంది.

By

Published : Jul 1, 2020, 3:44 PM IST

Updated : Jul 1, 2020, 7:01 PM IST

ఏపీసీడ్స్.. విత్తనాల రవాణాకు ఆర్టీసీ కార్గో సేవలు
ఏపీసీడ్స్.. విత్తనాల రవాణాకు ఆర్టీసీ కార్గో సేవలు

ఏపీసీడ్స్.. విత్తనాల రవాణాకు ఆర్టీసీ కార్గో సేవలు

ఆర్టీసీ కార్గో పార్శిల్ సర్వీసు ద్వారా రైతు భరోసా కేంద్రాలకు విత్తనాలను సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఏపీసీడ్స్​ ద్వారా ఖరీఫ్, రబీలకు అవసరమైన విత్తనాలను రైతులకు చేర్చేందుకు ఆర్టీసీ కార్గో సేవలు వినియోగిస్తున్నారు. అందుకుగాను నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ కార్గో సేవలు ఉపయోగపడుతున్నాయి.

గతంలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు లారీల ద్వారా విత్తనాలు సరఫరా చేసేవారు. ఈ ఏడాది నుంచి ఆర్టీసీ సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల మేరకు గోదాముల నుంచి విత్తనాలను జిల్లాలోని అన్ని రైతు భరోసా కేంద్రాలు చేరుస్తున్నారు.

టన్నుకు రూ.950 చెల్లింపు

ప్రజారవాణాతో పాటు కార్గో సేవల ద్వారా ఆదాయం పెంచేందుకు ఆర్టీసీ కృషిచేస్తుంది. జిల్లాలోని ప్రతి డిపో పరిధిలో కార్గోసేవలు కొనసాగుతున్నాయి. నెల్లూరు నుంచి 46 మండలాల్లోని రైతు భరోసా కేంద్రాలకు విత్తనాలను కార్గో వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారు. విత్తనాల రవాణాకు ఏపీసీడ్స్ టన్నుకు రూ.950 ఆర్టీసీకి చెల్లిస్తుంది.

మొదటిగా పచ్చిరొట్ట విత్తనాలు వెయ్యి క్వింటాళ్లు కార్గో వాహనాల్లో పంపిస్తున్నారు. నెల్లూరులోని నాలుగు ఏపీ సీడ్స్ గోదాముల నుంచి నాయుడుపేట, కావలి, వింజమూరుకు విత్తనాలు రవాణా చేస్తున్నారు. అదేవిధంగా రబీ సీజన్​కు 26 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంతో త్వరతగతిన విత్తనాలు చేరడంతో పాటు, ఆర్టీసీకి ఆదాయం సమకూరుతుందని అంటున్నారు.

ఇదీ చదవండి :సింహాచల ఆలయ ట్రస్ట్​ బోర్డ్ నుంచి ఒకరు తొలగింపు

Last Updated : Jul 1, 2020, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details