నెల్లూరు జిల్లా గూడూరు మార్కెట్‌లో నిమ్మకాయలు రికార్డు ధర పలికాయి. యాపిల్ ధరలతో పోటీ పడుతున్నాయి. శ్రీబాలాజీ లెమన్ మార్కెట్‌కు రైతులు తెచ్చిన మొదటి రకం (ఆకు పచ్చవి) కాయలను వ్యాపారులు కిలోకు రూ.160 వెచ్చించి కొనుగోలు చేశారు. రెండో రకం కాయలు రూ.130 నుంచి రూ.150, పండ్లు రూ.100 నుంచి రూ.130 పలికాయి.
యాపిల్‌తో పోటీ పడుతున్న నిమ్మకాయలు.. ధర ఎంతంటే..! - నెల్లూరు తాజా వార్తలు
Record price to Lemons: వేసవిలో నిమ్మకాయల ధర పెరగడం సాధారణమే. కానీ ఏకంగా వాటి ధర.. యాపిల్ పండ్ల ధరకు చేరడమంటే అది రికార్డు ధర అనొచ్చు. గూడూరు మార్కెట్‌లో కిలో నిమ్మకాయల ధర రూ.160 పలికింది.
నిమ్మకాయలకు రికార్డు ధర
గతేడాది ఇదే సమయంలో కిలోకు గరిష్ఠంగా రూ.70 దక్కాయని రైతులు గుర్తు చేసుకున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో డిమాండు ఏర్పడిందని వ్యాపారులంటున్నారు. నిత్యం ఈ మార్కెట్‌కు 20 లారీల సరకు వస్తోంది. జిల్లాలో కిలో యాపిల్స్ రూ.150 నుంచి రూ.200 పలుకుతున్నాయి.
ఇదీ చదవండి: Agriculture: రైతులకు అందని సాయం.. ఏటికేడు నిధుల్లో కోత
Last Updated : Apr 4, 2022, 12:44 PM IST