- 'గాంధీ అహింస ఆయుధానికి.. నిరంకుశత్వం తలవంచింది'
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌తో పాటు అధికార పార్టీ, విపక్షనేతలు నివాళులు అర్పించారు. గాంధీ సూచించిన మార్గంలో భవిష్యత్తు తరాలు నడవాలని వారు ఆకాంక్షించారు.
- పోరాటానికి ప్రభుత్వ వైఖరే కారణం.. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మె: ఉద్యోగ సంఘాలు
పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగుల పోరాటానికి ప్రభుత్వ వైఖరే కారణమని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. మెరుగైన వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమిస్తున్నాయన్నారు.
- PRC: 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు ప్రాసెస్ చేస్తున్న ట్రెజరీ ఉద్యోగులు
ట్రెజరీ ఉద్యోగులు, డీడీవోలు ఆదివారం విధులకు హాజరయ్యారు. ఉద్యోగులకు తాజా పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో జీతాల ప్రాసెస్‌కు సహకరించని ట్రెజరీ ఉద్యోగులు, అధికారులపై చర్యలు ఉంటాయని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు.
- STUDENT SUICIDE: ఆత్మహత్య చేసుకున్న బాలికకు న్యాయం చేయాలని తెదేపా డిమాండ్
విజయవాడలోని భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్లో అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలికకు న్యాయం చేయాలని తెదేపా మహిళా నేతలు డిమాండ్ చేశారు. బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన నేతలు.. ఈ ఘటనపై మండిపడ్డారు.
- సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. విపక్షాల 'ఆపరేషన్ పెగసస్'!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్‌ను సభ ముందు ఉంచనున్నారు.
- ఎక్కడికెళ్లినా అఖిలేశ్ వెంటే ఆ మూట.. ఇంతకీ అందులో ఏముంది?
యూపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రచారం ముమ్మరం చేశారు. అయితే ఆయన ఎక్కడికెళ్లినా వెంట ఓ చిన్న ఎర్రటి మూటను తీసుకెళ్తున్నారు. ఇంతకీ అందులో ఏముంది? దీనిపై అఖిలేశ్ మాటేమిటి?
- ఒకేసారి ఆరు వాహనాలు ఢీ- తొమ్మిది మంది మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు వాహనాలు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
- వంట గ్యాస్ ధర తగ్గింపు! ఎస్బీఐలో ఆ సేవలు ఫ్రీ!! ఫిబ్రవరిలో వచ్చే మార్పులివే...
సామాన్యుడిపై ప్రభావం చూపే.. బ్యాంకింగ్, రైల్వే, పోస్టాఫీసులకు సంబంధించిన నిబంధనలు, ఎల్పీజీ ధరల్లో మార్పుల వంటివి చాలా ముఖ్యమైనవి. ఫిబ్రవరి 1న అమలులోకి రానున్న మార్పులేమిటి? వంట గ్యాస్ ధర మరింత ప్రియం కానుందా?
- శిఖరాగ్రాన భారత జట్టు.. ఆ మ్యాచ్‌తో 1000 వన్డేల రికార్డు
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమ్ఇండియా అరుదైన ఘనత సాధించనుంది. వన్డేల్లో 1000 మ్యాచ్‌లు ఆడిన తొలి టీమ్‌గా నిలువనుంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ కంటే ముందుగానే భారత్ ఈ ఘనత సాధిస్తుండటం విశేషం.
- Kajol Coronavirus: బాలీవుడ్ నటి కాజోల్కు కరోనా
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన ఆమె.. తన కూతురు ఫొటోను షేర్ చేసి ఓ ఆసక్తికర కామెంట్ పెట్టారు.
ప్రధాన వార్తలు @5PM