ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆనందయ్య మందుపై తొలిదశ అధ్యయనం పూర్తి.. సీసీఆర్ఏఎస్ కు నివేదిక - నెల్లూరు వార్తలు

ఆనందయ్య రూపొందించిన కరోనా మందుపై సీసీఆర్ఏఎస్ తొలి దశ అధ్యయనం పూర్తి చేసింది. నివేదికను ఆన్​లైన్​ ద్యారా ఇప్పటికే అధికారులు సీసీఆర్ఏఎస్​కు అందించారు. మలిదశ ప్రయోగాలకు అవసరమైన అనుమతుల కోసం వేచిచూస్తున్నట్లు వారు తెలిపారు.

anandayya medicine trails first phase completed
ఆనందయ్య మందుపై తొలిదశ అధ్యయనం పూర్తి

By

Published : May 26, 2021, 5:34 PM IST

ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ తొలి దశ అధ్యయనం పూర్తైంది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు రెస్ట్రోపెక్టివ్ స్టడీ ని ఆయుర్వేద వైద్యులు పూర్తి చేశారు. ఈ పరిశోధనల నివేదికను ఆన్‌లైన్‌లో సీసీఆర్ఏఎస్‌కు.. అధికారులు అందజేశారు. ఇందుకోసం మందు తీసుకున్న 570 మందిని ఫోన్లో సంప్రదించిన వైద్యులు.. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు.

రోగులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ పై ఆయుర్వేద అధికారులు వివరాలు ఇవ్వలేదు. రేపటిలోగా సీసీఆర్ఏఎస్ తదుపరి ఆదేశాలు జారీ చేయనుందని వారు భావిస్తున్నారు. ఆదేశాలు అందిన వెంటనే తర్వాతి దశ ప్రయోగాలు ప్రారంభించి టాక్సిక్ స్టడీ, జంతువులపై పరీక్షలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details