ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సమస్యల వలయంలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాల - నెల్లూరులో ప్రభుత్వ ఆదర్శ పాఠశాల న్యూస్

'మేలిపండు చూడ మేలిమై ఉండు... పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు'... ఆ పాఠశాలను చూస్తే మనందరికీ సుమతీ శతకంలోని ఈ పద్యం గుర్తుకు రాక మానదు. పేరుకే ఆదర్శ పాఠశాల... కానీ ఆ ఆవరణలో అడుగుపెడితే సమస్యలు గుట్టలుగా దర్శనమిస్తాయి. మౌలిక వసతుల కరవు, ఉపాధ్యాయుల కొరత మధ్య విద్యార్థులు నెట్టుకొస్తున్నారు.

adarsha-patasala-problems-in-nellore

By

Published : Nov 20, 2019, 12:31 PM IST

నెల్లూరులోని పాత మున్సిపల్‌ కార్యాలయం రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ఇది. అయితే 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్టుగానే ఉంది దీని పరిస్థితి. బీటలు వారిన గోడలు, ఎప్పుడు ఊడిపడతాయో తెలియని విధంగా ఉన్న పెచ్చులు... ఇలా వీటి మధ్యే చిన్నారులంతా విద్యాభ్యాసం చేస్తున్నారు. 1955లో ఏర్పాటైన ఈ పాఠశాల నానాటికీ శిథిలమవుతూనే ఉంది. పాఠశాల మైదానంలోనే మురుగు ప్రవహిస్తుండటం... విద్యార్థుల ఆరోగ్యానికి సంకటంగా మారింది.

మౌలిక వసతుల కరవుతో పాటు ఉపాధ్యాయుల కొరతా వేధిస్తోందని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను గుర్తించి ఇప్పటికైనా పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

సమస్యల వలయంలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాల

ABOUT THE AUTHOR

...view details