నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రెండోరోజు అనిశా తనిఖీలు చేశారు. రెండో రోజు తనిఖీల్లో రూ. 6.50కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు అధికారులు గుర్తించారు. నగరపాలక సంస్థలో వాణిజ్య అనుమతులకు సంబంధించి కుంభకోణంలో కంప్యూటర్ ఆపరేటర్ల పాత్ర కీలకంగా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. డీఎస్సీ మోహన్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్న అధికారులు.. ఆఫీస్‌లో పలు దస్త్రాలు పరిశీలించారు. ప్రభుత్వానికి రావలసిన సుమారు 6.50కోట్ల సొమ్మును కాజేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 20మంది శానిటరీ ఇన్స్పెక్టర్లను విచారించాగా.. వీరిలో ఏ ఒక్కరికి డిజిటల్ కీ వినియోగించడం రాదని నిర్ధారణకు వచ్చారు. కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న బాబు అనే వ్యక్తి దగ్గర డిజిటల్ కీ ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ సొమ్ము కాజేయడంలో ఎఫ్1, ఎఫ్3 క్లర్కులు చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. వీరితోపాటు డీపీవోలు శ్రీను, నవీన్‌లు.. కీలకపాత్ర పోషించినట్లు గుర్తించారు. పారిశుద్ద్యం సిబ్బందికి సంబంధించిన హాజరులో తేడాలు ఉన్నట్లు తేలింది.
ACB: నెల్లూరు కార్పొరేషన్లో రూ. 6.50కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి - నెల్లూరులో రెండోరోజు కొనసాగుతున్న అనిశా దాడులు
ACB Raids Continue at Nellore Corporation: నెల్లూరు కార్పొరేషన్లో రూ. 6.50కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు అనిశా అధికారులు గుర్తించారు. కార్పొరేషన్ కార్యాలయంలో రెండోరోజు అనిశా అధికారులు తనిఖీలు చేపట్టారు.
నెల్లూరు కార్పొరేషన్లో రూ. 6.50కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి