కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తనపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని వైకాపా మహిళా విభాగం నాయకురాలు జమిలాబీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం వల్ల ఆత్మహత్యాయత్నం చేశానని జమిలాబీ తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యే తనును ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీడియా ముందు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి విషయం తీసుకెళ్లాలని కోరారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన వారిపై అక్రమ కేసులు పెట్టడం ఏంటని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేనే అక్రమ కేసు పెట్టారు.. వైకాపా మహిళా నేత ఆవేదన - కర్నూలు వార్తలు
సొంత పార్టీ నేత తనపై అక్రమ కేసులు పెట్టారంటూ వైకాపా మహిళా నాయకురాలు కర్నూలులో ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్లే తాను మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు.

సొంత పార్టీ ఎమ్మెల్యే అక్రమ కేసు పెట్టారంటూ.. వైకాపా మహిళా నేత ఆవేదన