ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోడుమూరులో రెచ్చిపోయిన యువకులు.. మద్యం మత్తులో - Youth melee with sticks In Kodumuru

Youngsters fight: మద్యం మత్తులో తాము ఎక్కడ ఉన్నామో... ఏం చేస్తున్నామో కూడా మర్చిపోయారా యువకులు. పట్టపగలే పరస్పరం కర్రలతో విచక్షణారహితంగా దాడులకు దిగారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగింది. అయితే ఎందుకు గొడవకు దిగారో ఎవరికీ తెలియదు.

Youth melee with sticks In Kodumuru
Youth melee with sticks In Kodumuru

By

Published : Jun 1, 2022, 5:09 PM IST

కర్నూలు జిల్లా కోడుమూరులో బుధవారం మధ్యాహ్నం కొందరు యువకులు రెచ్చిపోయారు. పత్తికొండ రహదారి పక్కన ఉన్న డాబా వద్ద మద్యం మత్తులో పరస్పరం వాగ్వాదానికి దిగి.. దాడులు చేసుకున్నారు. యువకులు ఫూటుగా మద్యం సేవించి... విచక్షణా కోల్పోయి కర్రలతో కొట్టుకున్నారు. అయితే అసలు ఏం జరిగింది.. గొడవకు కారణం ఏంటనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details