కర్నూలులోని కలెక్టరేట్ ఎదుట ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక గాంధీ విగ్రహం ముందు నడిరోడ్డుపై పురుగుల మందు తాగాడు. బాధితుడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం చిన్నమర్రివీడు గ్రామానికి చెందిన రంగస్వామి.
చిన్నమర్రివీడు గ్రామంలో దేవాలయ నిర్మాణం కోసం సేకరించిన డబ్బు విషయమై గొడవ జరగటంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు రంగస్వామి తెలిపాడు. అనంతరం అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై మూడో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.