Young boxer Srikaracharya: అతడు విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు... విద్యనభ్యసించే సమయంలో బాక్సింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు పులి పంజాలా పంచ్‌లు విసురుతూ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. పసిడి పతకం కూడా సాధించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి ఎంపికై ఔరా అనిపిస్తున్నాడు. అతడే కర్నూలుకు చెందిన శ్రీకరాచార్యులు.
Young boxer: బాక్సింగ్‌లో శ్రీకర్‌లోని ప్రతిభను గుర్తించిన కోచ్... ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 2017 నుంచి శిక్షణ తీసుకుంటున్న శ్రీకర్... 2018 నుంచి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించాడు. 2018 జనవరిలో నంద్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో మొదటిసారి పాల్గొని కాంస్యం సాధించాడు. 2019లో కర్నూలులో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించించాడు. అదే ఏడాది రాజంపేటలో రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణం, గుజరాత్ గాంధీనగర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రజతం సాధించాడు. 2020 డిసెంబర్లో విశాఖలో రాష్ట్రస్థాయిలో పసిడి లభించింది.
Srikaracharya: జనవరి 2021లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కాంస్యం పొందాడు. అదే ఏడాది బనగానపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పసిడి సాధించాడు. గతేడాది డిసెంబరులో గోవాలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి, అంతర్జాతీయస్థాయి పోటీలకు ఎంపికై శభాష్ అనిపించుకున్నాడు.