ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అబ్బాయి పుట్టలేదని అత్తింటి వేధింపులు..కలెక్టరేట్​ ఎదుట బిక్షాటన - కర్నూలు కలెక్టరేట్​ వద్ద మహిళ నిరసన, న్యాయం చేయాలని బిక్షాటన

woman protest: ఆడపిల్లలను కనడమే నా తప్పా.. మహిళలంటే ఇంత వివక్షా..? న్యాయం కోసం పోరాడితే ఊర్లోనే లేకుండా చేస్తానన్న పోలీసులపై చర్యలు లేవా? అంటూ ఓ గృహిణి తన ముగ్గురు ఆడపిల్లలతో కర్నూలు కలెక్టరేట్​ ఎదుట నిరసనకు దిగింది. అత్తింటి వేధింపుల నుంచి తాను, తన పిల్లలకు న్యాయం చేయాలని బిక్షాటన చేపట్టింది.

woman protested at Kurnool Collectorate
న్యాయం చేయాలని కలెక్టరేట్​ ఎదుట బిక్షాటన

By

Published : Mar 11, 2022, 9:14 AM IST

న్యాయం చేయాలని కలెక్టరేట్​ ఎదుట బిక్షాటన

woman protest at Kurnool Collectorate: కర్నూలులో ఓ మహిళ న్యాయ పోరాటానికి దిగింది. అబ్బాయి కోసం అత్తింటివాళ్లు వేధిస్తున్నారని.. తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్​ ఎదుట భిక్షాటన చేస్తూ ఆందోళనకు దిగింది. కర్నూలు జిల్లా డోన్​కు చెందిన లక్ష్మీకి 12 ఏళ్ల క్రితం ఈభూది సురేంద్రతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. అబ్బాయి పుట్టలేదని భర్త, అత్త వేధిస్తున్నారని బాధితురాలు తెలిపింది.

ఈ విషయంపై డోన్ పోలీసులను ఆశ్రయించగా కోర్టులో చూసుకోవాలని చెప్పారని వాపోయింది. ముగ్గురు పిల్లలను ఎలా పోషించుకోవా‌లని లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు బిక్షాటన చేసి నిరసన తెలిపింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details