కర్నూలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నూతనపల్లె గ్రామస్థులు ఆందోళన చేశారు. తమ గ్రామానికి చెందిన వాలంటీర్ రంగడును అక్రమంగా విధుల నుంచి తప్పించారని ఎంపీడీవో భాస్కర్ నాయుడును అడ్డుకున్నారు. పొలం విషయంలో జరిగిన గొడవపై కేసు పెట్టానని.. ఈ విషయంపై కేసు ఉపసంహరించుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఒత్తిడి చేశారని రంగడు తెలిపారు. వాలంటీర్ ఫిర్యాదుపై స్పందించిన ఎంపీడీవో భాస్కర్ నాయుడు... ఈ విషయంపై విచారణ జరిపిస్తానని వెల్లడించారు.
అక్రమంగా విధుల నుంచి తప్పించారు: ఓ వాలంటీర్ ఆవేదన - protest at kurnool MPDO office
కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఒత్తిడి చేస్తున్నాడంటూ... ఓ వాలంటీర్ కర్నూలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తనను అక్రమంగా విధుల నుంచి తప్పించారని ఫిర్యాదు చేశారు.
కర్నూలులో ఆందోళన