నంద్యాల జిల్లాలో ఓ వాలంటీర్.. గ్రామస్తురాలి ఖాతా నుంచి 70 వేల రూపాయలు కొట్టేసిన ఘటన వెలుగు చూసింది. గడివేముల మండలం తిరుపాడులో ఈ ఘటన జరిగింది. రైతు భరోసా డబ్బులు రాలేదని అడిగిన నాగవేణి అనే మహిళతో వాలంటీర్ బాలమద్దులు నాలుగు సార్లు వేలి ముద్రలు వేయించుకున్నాడు. ఆధార్ కార్డు అవసరం ఉందని తీసుకువెళ్లాడు. వాటి ఆధారంగా మహిళ ఖాతా నుంచి 70 వేలు నగదు విత్ డ్రా చేశాడు. అనుమానం వచ్చిన మహిళ బ్యాంకుకు ఖాతా పరిశీలిస్తే... డబ్బులు మాయమైన విషయం తెలిసింది. నాగవేణి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు... ప్రస్తుతం వాలంటీరు పరారీలో ఉన్నాడని తెలిపారు.
నాలుగు వేలి ముద్రలతో 70వేలు స్వాహా.. ఎలాగంటే? - పరారీలో వాలంటీర్
నంద్యాల జిల్లాలో ఓ వాలంటీర్ అక్రమానికి పాల్పడ్డాడు. ఓ మహిళకు తెలియకుండానే ఆమె ఖాతా నుంచి నగదు స్వాహా చేశాడు. అనుమానం వచ్చిన మహిళ బ్యాంకుకు వెళ్లి ఖాతా పరిశీలించగా నగదు విత్డ్రా చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వాలంటీర్ పరారీలో ఉన్నాడు.
నాగవేణి