ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vedic student murder: వేద విద్యార్థి మృతి కేసులో వెలుగులోకి కొత్త కోణం.. - కర్నూలులో వేద విద్యార్థి హత్య

Vedic student murder: వేద విద్యను అభ్యసించేందుకు వచ్చిన విద్యార్థిని.. గురువు, అతని భార్య కలిసి దారుణంగా హింసించి హతమార్చారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. రెండేళ్ల తర్వాత వాస్తవాలు వెలుగు చూశాయి. నంధ్యాల జిల్లా సున్నిపెంటలో వేద విద్యార్థి మృతి.. చివరికి హత్యగా నిర్ధారణ అయింది.

Murder
వేద విద్యార్థి హత్య కేసు

By

Published : Oct 18, 2022, 12:01 PM IST

Vedic student murder: వేద విద్యను అభ్యసించేందుకు వచ్చిన విద్యార్థిని.. గురువు, అతని భార్య కలిసి దారుణంగా హింసించి హతమార్చారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. రెండేళ్లుగా మరుగున పడిన ఈ కేసుని ఇటీవల పోలీసు అధికారి కూపీ లాగితే అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నగరం సమీపంలోని ఎదురూరు గ్రామానికి చెందిన సువర్ణ, మహేష్‌ దంపతుల కుమారుడు మధుకుమార్‌ శర్మ (చనిపోయే నాటికి 13 ఏళ్లు). తమ కుమారుడిని శ్రీశైలం మండలం సున్నిపెంటలో రామశర్మ, శిరీష దంపతులు నిర్వహిస్తున్న ప్రైవేటు వేద పాఠశాలలో చేర్పించారు. రామశర్మ దంపతులు మధుకుమార్‌ శర్మతో ఇంటి పని, వంటపని చేయించుకునే వారు. మాట వినకపోతే దూషించడంతో పాటు తీవ్రంగా కొట్టేవారు.

ఈ క్రమంలో ఓరోజు యజ్ఞం చేసే సమయంలో చెప్పిన మాట వినలేదని మధుకుమార్‌ ఒంటిపై వాతలు పెట్టి చీకటి గదిలో నిర్బంధించారు. ఆరు రోజుల తర్వాత గది తలుపు తెరిచి చూస్తే విద్యార్థి చనిపోయి ఉన్నాడు. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై 2020 జులై 7న శ్రీశైలం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. విద్యార్థి ఆహారం, నీరు లేక మరణించాడంటూ కొద్దిరోజుల తర్వాత పోస్టుమార్టం నివేదిక అందింది. తర్వాత కేసు విచారణను మరుగున పడేశారు.ఆత్మకూరు డీఎస్పీ శ్రుతి ఇటీవల శ్రీశైలం పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు.

ఈ కేసు వివరాలను పరిశీలించిన ఆమె.. విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు, పోస్టుమార్టం నివేదికలో వ్యత్యాసాన్ని గమనించి పునర్విచారణకు ఆదేశించారు. నందికొట్కూరు సీఐ సుధాకర్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. గురువు దంపతులు వాతలు పెట్టడంతోనే విద్యార్థి మృతి చెందినట్లు సీఐ నిర్ధారించారు. అనుమానాస్పద మృతిని హత్యగా మార్చి కేసు నమోదు చేశారు. రామశర్మ, శిరీష దంపతులను అరెస్టు చేసి ఈ నెల 11న రిమాండుకు తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details