ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శిథిలమైన బడిలో బండరాళ్లే బ్లాక్​బోర్డులు - కర్నూలులో ఉర్దూ పాఠశాల శిథిలం

పాఠశాలలు.. విద్యార్థుల భవితవ్యానికి పునాదులు. అక్కడ చదువుకుని పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. అలాంటి పాఠశాల శిథిలావస్థకు చేరింది. 2 గదుల్లో 7తరగతులకు పాఠాలు బోధిస్తున్నారు. ఎప్పుడు కూలిపోతుందోనన్న భయంతోనే విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారిక్కడి పిల్లలు.

శిథిలమైన పాఠశాల.

By

Published : Oct 25, 2019, 9:12 PM IST

కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం ఎర్రగుంట్లలోని ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఈ పాఠశాలలో బోధిస్తారు. సుమారు 140 విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ఈ బడి నిర్మించి 20 ఏళ్లైంది. పాఠశాల మొత్తం దాదాపు శిథిలవాస్థకు చేరింది. రెండు గదుల్లో ఏడు తరగతులు నిర్వహించటం సాధ్యం కాక పక్కనే ఉన్న దర్గాలో స్కూలు నడుపుతున్నారు. కనీసం నల్లబల్ల లేక బండరాళ్లనే బ్లాక్​బోర్డుగా ఉపయోగిస్తున్నారు. గతంలో ఈ పాఠశాలలో 60 మంది విద్యార్థులే ఉండేవారు. అయితే ఉపాధ్యాయులు చొరవ తీసుకుని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించి పిల్లలను బడిలో చేర్పించారు. ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు ఆ బడిలో చదువుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగినా సౌకర్యాలు మాత్రం పెరగలేదు. శిథిలమైన భవనం ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం మధ్యే పిల్లలు పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలకు మరమ్మతులు చేయించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

శిథిలమైన పాఠశాల.

ABOUT THE AUTHOR

...view details