దొంగనోట్ల చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా పైపాడు గ్రామానికి చెందిన వీరబోగు పుల్లన్న, మల్లెపోగు రాజశేఖర్ కర్నూలులోని ఓఎలక్ట్రానిక్ దుకాణంలో టీవీ కొనుగొలు చేసి నకీలీ నోట్లు ఇచ్చారు. షాపు యజమాని గుర్తించి అడిగేలోపు ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా దొంగనోట్ల చెలామణికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి 1 లక్ష 94 వేల రూపాయల నకీలీ నోట్లను స్వాదీనం చేసుకున్నట్లు సీ.ఐ. పార్థసారధి రెడ్డి తెలిపారు.
దొంగనోట్లు స్వాధీనం.. ఇద్దరి ఆరెస్ట్ - కర్నూలు నేర వార్తలు
తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు.. కర్నూలులో దొంగనోట్లు చెలామణి చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి లక్షా 94 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
fake cutrrency