ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ ముఖ్యవార్తలు

..

TOP NEWS
TOP NEWS

By

Published : Oct 14, 2021, 9:02 PM IST

  • Maoist leader RK: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత
    మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ (ఆర్కే) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దక్షిణ బస్తర్‌ అడవుల్లోని మాడ్‌ అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఆర్కే మృతిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ధ్రువీకరించ లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CM REVIEW: కరెంట్​ కోతలు లేకుండా చర్యలు చేపట్టాలి: సీఎం జగన్
    కరెంటు కోతలు లేకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కరెంటుపై నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ సంక్షోభం నుంచి ముందుకు వెళ్లాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రాజెక్టులు బోర్డులకు అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వం... కానీ..
    రాష్ట్రంలోని ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా తాజా నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణలోని ప్రాజెక్టులను స్వాధీనం చేస్తేనే తాము బోర్డులకు అప్పగిస్తామని ఏపీ షరతు పెట్టింది. షరతులతో నేటి నుంచే ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వం అంగీకరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RAGHURAMA: 'జగన్ పాలనలో రూ.2.87 లక్షల కోట్లు అప్పు'
    వైకాపా పాలనపై ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. సీఎం ప్రవేశపెట్టిన నవరత్నాల్లో ఒకటి రాలిపోయిందని ఎద్దేవా చేశారు. జగనన్నవి కొవ్వొత్తి, అగ్గిపెట్టె పథకాలని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతోందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మరోసారి మెరుపుదాడులు తప్పవు'- పాక్​కు​ షా హెచ్చరిక!
    సరిహద్దుల వద్ద ఆటంకాలు సృష్టిస్తే మళ్లీ మెరుపుదాడులు తప్పవని పాకిస్థాన్​కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah News). సరిహద్దుల వద్ద సమస్య అనే ప్రశ్న తలెత్తితే అందుకు అనుగుణంగానే జవాబిస్తామని స్పష్టంచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విజయ్ 'సైలెంట్​ పాలిటిక్స్'​- ఆ ఎన్నికల్లో 100 మంది గెలుపు
    అధికారిక ప్రకటన చేయకుండానే... స్టార్​ హీరో విజయ్​ 'రాజకీయాలు' మొదలుపెట్టారా? పార్టీ స్థాపించకుండానే.. అభిమాన సంఘం ద్వారానే 'అన్నీ' నడిపిస్తున్నారా? ఔననే అంటున్నాయి తమిళ రాజకీయ వర్గాలు. ఇటీవల జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ ఫ్యాన్స్​ అసోసియేషన్​ సభ్యులు 100 మందికిపైగా గెలవడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనా మూలాలపై అధ్యయనానికి మరో కమిటీ.. ఈసారైనా...?
    కరోనా గుట్టు తేల్చే ప్రయత్నాలు మళ్లీ మొదటికి వచ్చాయి. చైనాలోని వుహాన్​ ల్యాబ్​లోనే వైరస్​ పుట్టిందని ఆరోపణలు వెల్లువెత్తినా ఎటూ తేల్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. మరో కొత్త బృందాన్ని ఏర్పాటు చేసింది. కరోనా సహా ఇతర వైరస్​ల పుట్టుకపై ఈ నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సెప్టెంబర్​లో భారీగా పెరిగిన ఎగుమతులు
    సెప్టెంబర్​ నెలలో దేశీయ ఎగుమతులు (India Exports And Imports) గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. 22.63 శాతం పెరిగి సుమారు 34 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టీమ్​ఇండియా కొత్త జెర్సీతో మెరిసిన బుర్జ్​ ఖలీఫా
    టీమ్​ఇండియా కొత్త జెర్సీని(Team India Jersey) ప్రపంచ ప్రఖ్యాత కట్టడం బుర్జ్​ ఖలీఫాపై(team india jersey on burj khalifa) ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఇండస్ట్రీకి తండ్రులు'
    ఏపీ థియేటర్లలో 100 శాతం ప్రేక్షకుల్ని అనుమతించడంపై నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. సినీ పరిశ్రమకు తండ్రుల్లాంటివారని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details