Tigers Death at Ganderu Reservoir: కర్నూలు జిల్లా రుద్రవరం నల్లమల అటవీ రేంజ్ పరిధిలో పెద్దపులి కళేబరం లభించడం సంచలనంగా మారింది. రుద్రవరం మండల పరిధిలోని గండలేరు జలాశయం వద్ద బుధవారం ఈ కళేబరాన్ని గుర్తించారు. వాస్తవానికి రెండు రోజుల క్రితమే నల్లమల పరిధిలోని చెలిమె రేంజ్ లోని పెద్ద కమ్మలూరు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు పెద్దపులి చిక్కి మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. డీఎఫ్ఓ ఈ వార్తలను ఖండించారు.
Tiger Death : పెద్దపులి కళేబరం లభ్యం.. అదుపులో ఇద్దరు అనుమానితులు - గండేరు జలాశయం వద్ద పెద్దపులి కళేబరం
Tigers in Nallamala Forest : కర్నూలు జిల్లా రుద్రవరం నల్లమల అటవీ రేంజ్ పరిధిలో పెద్దపులి కళేబరం లభించడం సంచలనంగా మారింది. రుద్రవరం మండల పరిధిలోని గండలేరు జలాశయం వద్ద బుధవారం ఈ కళేబరాన్ని గుర్తించారు. పులి ఎలా మరణించిందన్న విషయంపై అటవీ అధికారులు విచారణ చేపట్టారు.
గండేరు జలాశయం వద్ద పెద్దపులి కళేబరం.
ఆ తర్వాత సిరివెళ్ల పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారు తెలిపిన వివరాల మేరకు కళేబరం ఆచూకీ తెలిసింది. పెద్దపులి కళేబరం లభించిన ప్రాంతాన్ని సీఐ చంద్రబాబు ఇతర అధికారులు పరిశీలించారు. పెద్దపులి ఎలా మరణించిన విషయాన్ని త్వరలోనే తెలుసుకుంటామని అటవీ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి :పాఠశాల విలీనం.. వద్దంటూ వినూత్న నిరసన