ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్నూలు ఆదోని షారాఫ్ బజారులో బంగారం దుకాణంలో చోరీ కలకలం - కర్నూలు జిల్లా తాజా వార్తలు

Theft in gold shop ఆదోని షారాఫ్ బజారులో బంగారం దుకాణంలో చోరీ జరిగింది. 2.50 కిలోల బంగారం, 25 కిలోల వెండి చోరీ జరిగిందని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

Theft
ఆదోని షారాఫ్ బజారులో బంగారం దుకాణంలో చోరీ

By

Published : Aug 27, 2022, 12:26 PM IST

Theft in gold shop నెల్లూరు జిల్లాలో బంగారం చోరీ ఘటన మరువక ముందే కర్నూలు జిల్లాలో మరో బంగారం చోరీ ఘటనలో కలకలం రేపింది. ఆదోనిలో బంగారం దుకాణంలో భారీ చోరీ ఘటన వెలుగుచూసింది. షారాఫ్ బజార్లోని ఓ బంగారం దుకాణంలో రెండున్నర కిలో బంగారం, 25 కిలోల వెండి ఎత్తుకెళ్లారని.. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం దుకాణం తీయడానికి వెళ్లాగా... అన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయని తెలిపారు. డాగ్‌ స్క్వాడ్‌ పసిగట్టకుండా కారం చల్లినట్లు వివరిచారు. దుకాణం సమీపంలోని సీసీ కెమెరాలో దొంగల దృశ్యాలు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

నెల్లూరు జిల్లాలోనూ:Movie style theft: సినిమాల ఎఫెక్ట్​ మనుషుల మీద చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. సినిమాల్లోనే మాదిరిగానే నిజ జీవితంలోనూ అలాంటి పని చేసి చూపిస్తున్నారు కొందరు. తగ్గేదేలే అంటున్నారు. తమిళ్​ హీరో సూర్య 'గ్యాంగ్​' సినిమాను చూశారా. అదేనండి సూర్య సీబీఐ ఆఫీసర్​గా నమ్మించి నగల దుకాణంలోని నగలన్నీ కొట్టేస్తాడు. గుర్తొచ్చిందా. ఇదిగో అచ్చం అలాగే చేసేందుకు ఓ గ్యాంగ్​ ప్లాన్​ చేసింది. అంతేకాదు రంగంలోకి దిగింది. తీరా పని పూర్తయి సంతోషంగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. చివరి నిమిషంలో గ్యాంగ్​ స్థానికులకు దొరికింది. ఇంతకీ ఇదంతా ఎక్కడ, ఎలా జరిగిందంటే..

నెల్లూరు జిల్లాలో శుక్రవారం (ఆగస్టు 26) సినీ ఫక్కీలో చోరీకి ప్రయత్నింది ఓ దొంగల ముఠా. ఐటీ అధికారుల పేరుతో భారీ చోరీ చేసేందుకు దుండగులు ప్రణాళిక రచించారు. నెల్లూరు కాకర్లవారి వీధిలోని లావణ్య జ్యువెలర్స్‌లో ప్లాన్​ అమలుకు సిద్ధపడ్డారు. తనిఖీల పేరుతో షాపులో హడావుడి చేశారు. సుమారు 12 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. బంగారంతో ఉడాయించేందుకు యత్నించిన వారిని స్థానికుల సాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ చోరీలో ఆరుగురు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ జరిపి నిందితులను రిమాండ్​కు తరలిస్తామన్నారు.



ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details