Deaths at Gajuladinne project : కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన విద్యార్థులు రాజేశ్ (14), నిహాల్(15) స్నేహితులు. ఆదోని పట్టణంలోని రాయనగర్‌లో ఉన్న ఎంపీ చర్చ్‌లో ప్రతి ఆదివారం మతానికి సంబంధించిన కార్యక్రమాల్లో వీరు పాల్గొంటారు. అలాంటి కార్యక్రమంలో భాగంగా చర్చికి వచ్చే విద్యార్థులంతా గాజులదిన్నె జలాశయం విహారయాత్రకు వెళ్లాలనుకున్నారు. 120 మంది రెండు బస్సులు సహా ఒక ఆటోలో గాజులదిన్నె ప్రాజెక్టుకు శనివారం బయలు వెళ్లారు. రాజేశ్, నిహాల్ కూడా వారితోపాటు వెళ్లారు.
అప్పటి వరకూ ఆనందంగా గడిపారు.. అంతలోనే నీటిలోకి దిగారు.. - Gajuladinne project
Gajuladinne project: సరదాగా గడపడానికి అందరూ విహారానికి వెళ్లారు. జలాశయం చుట్టూ చేరి.. ఎవరి సంతోషంలో వాళ్లున్నారు. అప్పటి వరకూ నవ్వుతూ తుల్లుతూ ఆనందంగా ఉన్న స్నేహితులు ఇద్దరూ.. అప్పడే జలాశయంలోకి దిగారు. ఊహించని ఘోరం జరిగిపోయింది.
అక్కడంతా జలాశయాన్ని చూస్తూ.. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తూ... ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. రాజేశ్, నిహాల్ కూడా సరదాగా గడిపారు. అయితే.. ఆ తర్వాత కాసేపటికి ఈతకొట్టడానికి జలాశయంలోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఇద్దరూ నీటిలో మునిగి కనిపించకుండాపోయారు. గమనించిన తోటివారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం అర్థరాత్రి సమయంలో రాజేష్, ఇవాళ ఉదయం నిహాల్ మృతదేహాలు జలాశయంలో లభ్యమయ్యాయి. ఆడుతూ పాడుతూ తిరిగే తమ బిడ్డల్ని విగతజీవులుగా చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
ఇవీ చదవండి :