ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనావాసాల్లోకి వచ్చిన మొసలి - crocodile came

నందికొట్కూరు మండలం మాల్యల గ్రామంలోకి ఓ మొసలి వచ్చింది. దాంతో స్థానికులు భయాందోళనకు గుర్యయ్యారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ముసలిని తీసుకుని అడవిలో వదిలారు.

crocodile
మొసలి

By

Published : Jul 28, 2021, 9:08 PM IST

జనావాసాల్లోకి వచ్చిన మొసలి

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామం సమీపంలో మొసలి హల్ చల్ చేసింది. మల్యాల ఎస్ఎస్ ట్యాంకు నుంచి నందికొట్కూరు పురపాలక మంచినీటి సరఫరా సాగుతోంది. ఈ ట్యాంకులో బుధవారం ముసలి తిరుగుతుండగా స్థానికులు గమనించారు. ఈ విషయమై అక్కడ పనిచేస్తున్న కార్మికుడు పురపాలక అధికారులకు, పాలక వర్గానికి సమాచారం అందించారు. వారిచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ముసలిని బంధించి అటవీ ప్రాంతానికి తరలించారు.
కృష్ణానదికి సమీపాన ఎస్ఎస్ ట్యాంకు ఉండడంతో నదిలో ఉన్న ముసలి దారితప్పి ట్యాంక్ లోకి ప్రవేశించినట్లు స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details