ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆంధ్రాలో భాజపాకు ఉజ్వల భవిష్యత్తు: రామ్​ మాధవ్

రాష్ట్రంలో భాజపాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామని... ఆంధ్రాలో సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. గుంటూరు కన్వెన్షన్​ సెంటర్​లో జరిగిన భాజపా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

By

Published : Jul 14, 2019, 2:37 PM IST

Updated : Jul 14, 2019, 4:31 PM IST

'నూతన రాజకీయ సంస్కృతి తీసుకురావడమే పార్టీ లక్ష్యం'

ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించిందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్​ తెలిపారు. గుంటూరు కన్వెన్షన్​ సెంటర్లో భాజపా పదాధికారుల సమావేశంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.​ 8 లక్షల బూత్​ కమిటీలు కలిగిన ఏకైక పార్టీగా భాజపా ఆవిర్భవించడం సంతోషమని తెలిపారు. ఈ విజయయాత్ర మనలో ప్రబోధాన్ని నింపాలని పేర్కొన్నారు. 'సబ్​ కా వికాస్'​ అనేది పార్టీ మూలసూత్రంగా భావిస్తున్నామని చెప్పారు. భాజపా అనేది కార్యకర్తల పార్టీగా అభివర్ణించారు. కులాల, గ్రూపు రాజకీయాలు తన పార్టీలో ఉండవని, అందుకే గత ఎన్నికల్లో దేశంలో 23 కోట్ల మంది తమకు మద్దతుగా ఓటేశారని గుర్తు చేశారు. పార్టీ సభ్యత్వాన్ని 16 కోట్లు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.భాజపాకు అధికారం పరమావధి కాదని... నూతన రాజకీయ సంస్కృతి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. మోదీ నూతన విధానాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని... అలాంటి పరిస్థితే ఏపీలో సైతం కనిపిస్తోందని చెప్పారు. ఈ సానుకూల పరిణామాలను పార్టీ శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై భాజపాకు నిరుత్సాహకరమైన ఫలితాలు రావడం విచారకరమని... దీనిని సవాల్​గా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పార్టీని తెలంగాణలో మాదిరిగా బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

ఆంధ్రాలో భాజపాకు ఉజ్వల భవిష్యత్తు: రామ్​ మాధవ్
Last Updated : Jul 14, 2019, 4:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details