Ten unknown persons attacked on man: కర్నూలులోని సంతోష్‌నగర్‌లో ఈనెల 15న రాజా గౌడ్ అనే వ్యక్తిపై దుండగులు దాడి చేశారు. ఓ షాపు వద్ద స్నేహితులతో కలసి మాట్లాడుతున్న రాజాగౌడ్‌ను పది మంది కర్రలు, సిమెంట్ ఇటుకలతో విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన రాజాగౌడ్‌ను స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఒక వ్యక్తిపై... పదిమంది దాడి.. ఎందుకంటే..? - కర్నూలులో వ్యక్తిపై దాడి చేసిన దుండుగులు
Ten unknown persons attacked on man: కర్నూలులో ఓ వ్యక్తిపై 10 మంది దుండగులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితులతో మాట్లాడుతుండగా.. కర్రలు, సిమెంట్ రాళ్లతో కొట్టారు. సెల్‌ఫోన్ పంచాయితీనే దాడికి కారణమని పోలీసులు తెలిపారు.
ఒక వ్యక్తిపై పదిమంది దుండగుల దాడి
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెల్‌ఫోన్ పంచాయితే ఈ దాడికి కారణమని పోలీసులు తెలిపారు. మరోవైపు రాజా గౌడ్‌పై జరిగిన దాడి దృశ్యాలు... సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Last Updated : Mar 22, 2022, 6:52 PM IST