ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LOKESH: కర్నూలు ఎస్పీకి నారా లోకేశ్​ లేఖ - latest news in kurnool district

వైకాపా ప్రయోజనాల కోసం పోలీసులు అసలు విధుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని.. తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కర్నూలు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

నారా లోకేశ్
Nara Lokesh

By

Published : Aug 26, 2021, 9:52 AM IST

తెదేపా కార్యకర్త పట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ.. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్.. కర్నూలు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. కర్నూలు జిల్లా వాసి రామాంజనేయులు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇదంతా జరుగుతోందని.. దురుద్దేశంతో లక్ష్యంగా చేసుకుని పోలీసులు వేధించడం సరికాదన్నారు. తప్పుడు కేసులు ఎదుర్కోవడం సామాన్యులకు శిక్షగా మారుతోందన్నారు. వైకాపా ప్రయోజనాల కోసం పోలీసులు అసలు విధుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details