Badude badudu programe:వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని కొణిదేడు గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె గ్రామంలో పర్యటించి పెరిగిన నిత్యవసర ధరలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను అందజేశారు. ఇతర రాష్ట్రాలతో పొలిస్తే మన రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయన్నారు. పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే నిత్యవసర వస్తువుల ధరలు అదుపులోకి వస్తాయని ఆమె తెలిపారు.
వైకాపా పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి - నిత్యవసర ధరలపై ప్రజలు మండిపాటు
Badude badudu programe: వైకాపా పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. తెదేపా ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని కొణిదేడు గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె గ్రామంలో పర్యటించి పెరిగిన నిత్యవసర ధరలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను అందజేశారు.
కర్నూలులో బాదుడే బాదుడు కార్యక్రమం