ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్నూలులో తందూరి ఛాయ్...ఆస్వాదిస్తున్న జనం - pot tea makini in kurnool

ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఏదైనా వ్యాపారంలో రాణించాలంటే విభిన్నంగా ఆలోచించాల్సిందే. లేదంటే నష్టాల బాట పట్టి దుకాణం సర్దుకోవాల్సిందే. ఈ విషయాన్ని గ్రహించిన కర్నూలు వాసి... అటు పర్యావరణానికి హాని లేకుండా...ఇటు ప్రజలకు వెరై'టీ' అందిస్తున్నాడు.

tandoori tea making in kurnool district
కర్నూలులో తందూరి ఛాయ్ పరిచయం...ఆస్వాదిస్తున్న జనం

By

Published : Jan 11, 2020, 10:26 AM IST

కర్నూలులో తందూరి ఛాయ్ పరిచయం...ఆస్వాదిస్తున్న జనం

కర్నూలులో శ్రీశైలం అనే వ్యక్తి టీ దుకాణం పెట్టాలనుకున్నాడు. ప్రస్తుతం వీధికొక ఛాయ్ దుకాణం ఉంది. వాళ్లందరిని కాదని... ఛాయ్ ప్రియులు తన వద్దకు రావాలంటే ఏదో ఒక వెరై'టీ' ఉండాల్సిందే అనుకున్నాడు. అదే సమయంలో రకరకాల 'టీ'ల గురించి తెలుసుకున్నాడు. ఇదే క్రమంలో రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో విక్రయించే తందూరీ ఛాయ్ గురించి ఆరా తీశాడు. దాన్ని కర్నూలు వాసులకు పరిచయం చేశాడు.

వైరై'టీ'తో జనం బారులు...
సాధారణంగా 'టీ' ని ప్లాస్టిక్, పేపర్, గాజు గ్లాసులో తాగడం చూస్తుంటాం. ఇక్కడ మాత్రం నిప్పులపై కాల్చిన మట్టికుండలో 'టీ'ని దమ్ చేసి మట్టి గ్లాసుల్లో పోసి అందిస్తారు. తక్కువ రేటు... వెరైటీ రుచిని కలిగి ఉండటంతో ఛాయ్ ప్రియులు సైతం దుకాణానికి బారులు తీరుతున్నారు. పది రూపాయలకే దొరికే ఈ'టీ'ని... పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కప్పులో కాకుండా పర్యావరణ హిత మట్టి కప్పులో ఇస్తుండటంతో ఛాయ్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా... ప్లాస్టిక్​ను వినియోగం తగ్గించే క్రమంలో ఈ ప్రయత్నం చేశానని దుకాణం నిర్వహకుడు చెబుతున్నాడు.

ఇవీ చూడండి-పక్షికింత ధాన్యం.. గురువుకు అంకింతం..!

ABOUT THE AUTHOR

...view details