కర్నూలు జిల్లాలోని సప్తనదీ సంగమ క్షేత్రం సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణా జలాలు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోకి లక్ష క్యూసెక్కులకుపైగా వరద నీరు వస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లోని ఈ ఆలయం... క్రమంగా మునిగిపోతోంది.
శ్రీశైలానికి భారీ వరద..మునుగుతున్న సంగమేశ్వరం ఆలయం - శ్రీశైలం సమాచారం
శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో సంగమేశ్వరం ఆలయం మునిగిపోతోంది. శ్రీశైలం జలాశయం వెనుక జలాలు పెరగడం వల్ల ఏడాదికి ఎనిమిది నెలలలు నీటిలోనే ఉంటుందీ ఆలయం.
సప్తపదీ సంగమేశ్వరం ఆలయం
ఏడాదికి 8 నెలలు నీటిలో ఉండే ఈ ఆలయం... శ్రీశైలంలో నీరు బాగా తగ్గిన తర్వాత బయటపడుతుంది.
ఇదీ చదవండి:AP RAINS: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు