SI caught red handed while accepting bribe : ఇరుగుపొరుగు వారి మధ్య ఇంటి స్థలం విషయమై ఘర్షణ జరిగింది. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. లక్ష రూపాయలు ఇస్తే న్యాయం చేస్తానని.. ఎస్ఐ చెప్పాడు. విసిగిపోయిన బాధితుడు ప్రకాష్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారమిచ్చాడు. రంగంలో దిగిన అనిశా అధికారులు మాటువేసి కర్నూలు జిల్లా సి.బెళగల్ ఎస్ఐ శివాంజల్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ACB: లంచం అడిగాడు.. అడ్డంగా బుక్కయ్యాడు - కర్నూల్ జిల్లాలో ఏసీబీ రైడ్స్ న్యూస్
SI caught red handed : నిన్న శ్రీకాకుళం.. నేడు కర్నూలు.. జిల్లా ఎదైనా అవినీతి తిమింగళాలకు డబ్బు ఆశ తీరడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా రోజు ఎక్కడో ఒకచోట అనిశా అధికారులకు దొరికిపోవడం పరిపాటిగా మారింది. కర్నూలు జిల్లాలో లంచం తీసుకుంటుండగా ఎస్ఐను అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కోడుమూరు నియోజకవర్గం సి. బెళగల్ మండలానికి చెందిన ప్రకాష్ ఆచారి అనే వ్యక్తి.. తన ఇంటి పక్క స్థలం వివాదంలో పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై శివాంజల్ను స్థల వివాదం పరిష్కరించాలని కోరాడు. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లను ఎస్ఐకి చూపించాడు. అయితే స్థల వివాదం పరిష్కరించాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కంగుతిన్న ప్రకాష్ ఆచారి.. ఆ సొమ్ము ఇచ్చేందుకు మొదట నిరాకరించాడు. ఆ తర్వాత అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించి.. విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాడు. ఏసీబీ సూచన మేరకు ప్రకాష్ ఆచారి ఎస్ఐ శివాంజల్‌కు డబ్బు ఇచ్చేందుకు అంగీకరించాడు. ప్రకాష్ నుంచి ఎస్ఐ రూ 50 వేలు లంచం తీసుకుంటుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు.. ఎస్ఐ శివాంజల్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మొదట ఆ సొమ్ము తనది కాదంటూ రోడ్డుపై పారేసిన ఎస్ఐ.. ఆ తర్వాత తప్పును అంగీకరించక తప్పలేదు.
ఇవీ చదవండి: