కర్నూలు జిల్లాలో కీచకుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దారుణాలను పరిశీలిస్తే.. మహిళలు, యువతుల పైనే కాకుండా జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు, అభంశుభం తెలియని పసిపిల్లల పైనా అత్యాచారాలు జరుగుతున్నాయి. అధిక కేసుల్లో బాధితుల సుపరితులే అఘాయిత్యాలకు పాల్పడుతుండటం గమనార్హం. యువకులు వృద్ధులతోపాటు బాలలు సైతం అత్యాచారాలకు బరి తెగిస్తున్నారు. ఒంటరిగా దొరికిన సమయాల్లో, నమ్మించి తీసుకెళ్లిన సందర్భంలో అధికంగా ఇలాంటివి జరుగుతున్నాయి. పిల్లల విషయంలో ప్రలోభానికి గురిచేసి తీసుకెళ్లటం, బాలికలను ప్రేమ పేరుతో నమ్మించి తీసుకెళ్లి అత్యాచారాలు చేస్తున్నారు. మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేసి గుర్తు పట్టని విధంగా కాల్చిచంపిన అమానవీయ ఘటనలు జిల్లాలో జరిగాయి. ఇటీవల కర్నూలులో ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడగా బనగానపల్లి పరిధిలో ఐదు మాసాల గర్భిణీపై అత్యాచారం జరిగింది. ఈ ఏడాది కరోనా మహిళలను అత్యాచారాల నుంచి కాపాడిందని చెప్పవచ్చు. ఈ కారణంగానే ఈ ఏడాది తక్కువ కేసులు నమోదయ్యాయి. పరువు కోసం ఫిర్యాదు చేయని బాధితులూ ఉన్నారు. మొత్తానికి బాలికలపైనే లైంగిక దాడులు అధికంగా జరుగుతున్నాయి.
ఆటో నేరగాళ్లపై నిఘా ఏదీ?
జిల్లా కేంద్రంలో పలువురు ఆటోడ్రైవర్లు గతంలో అత్యాచారాలకు పాల్పడ్డారు. బాధితుల్లో ఓ వైద్యురాలూ ఉన్నారు. మట్టి రవి, శ్రీనివాసులు వంటి నేరగాళ్లు ఆటోడ్రైవర్ల ముసుగులో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పోలీసులు వాళ్లను కటకటాల్లోకి పంపేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆటో నేరగాళ్లను దృష్టిలో ఉంచుకుని అప్పటి ఎస్పీ గోపీనాథ్‌జెట్టి మహిళల భద్రత కోసం ఆటో డిజిటలైజేషన్‌కు శ్రీకారం చుట్టారు. డ్రైవర్ల సీటు వెనుక ఉండే ప్రయాణికులు గుర్తించే విధంగా డిజిటల్ కార్డులు ఏర్పాటు చేయించారు. ఆయన బదిలీతో ఈ విధానం అటకెక్కింది. ప్రస్తుతం పలువురు ఆటో డ్రైవర్ల తీరు చూసి మహిళలు భయపడుతున్నారు.
షీ, శక్తి టీమ్‌లు కనుమరుగు