కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలో సర్వర్ పనిచేయకపోవటంతో పన్నులు చెల్లించేందుకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 5 రోజుల నుంచి సర్వర్ పనిచేయడం లేదని.. రోజూ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళుతున్నామని ప్రజలు అంటున్నారు. అది ఎప్పుడు పనిచేస్తుందో అధికారులు చెప్పడంలేదని.. ఇలా అయితే తాము పన్నులెలా చెల్లించాలంటూ వాపోతున్నారు. కరోనా సమయంలో ఇబ్బంది పెట్టడం సరికాదని.. త్వరగా సర్వర్ పనిచేసేలా చూడాలని కోరుతున్నారు.
పనిచేయని సర్వర్.. ఇబ్బందుల్లో ప్రజలు - కర్నూలు మున్సిపల్ కార్యాలయంలో పనిచేయని సర్వర్
కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలో సర్వర్ పనిచేయకపోవటంతో పన్నులు చెల్లించేందుకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సమయంలో ఇబ్బంది పెట్టడం సరికాదని.. త్వరగా సర్వర్ పనిచేసేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.
పనిచేయని సర్వర్.. ఇబ్బందుల్లో ప్రజలు