శ్రీశైల మహాక్షేత్రంలో రెండో కార్తీక సోమవారం సందర్భంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మ వార్ల ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. స్వామిఅమ్మ వార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
Srisailam : శ్రీశైలంలో దేదీప్యంగా లక్ష దీపోత్సవం - శ్రీశైలంలో లక్ష దీపోత్సవం
శ్రీశైల మహాక్షేత్రంలో రెండో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని లక్ష దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శ్రీశైలంలో రెండో కార్తీక సోమవారం లక్ష దీపోత్సవం
పుష్కరిణి చుట్టూ లక్ష కార్తీక దీపాలు సిద్ధం చేశారు. శ్రీస్వామిఅమ్మ వార్లకు అర్చకులు, వేదపండితులు వేద మంత్రాలతో దశవిధ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో కె.లవన్న పాల్గొన్నారు. భక్తులు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక దీపాల వెలుగులతో పుష్కరిణి ప్రదేశం దేదీప్యమానంగా దర్శనమిచ్చింది.
ఇదీ చదవండి : tickets scam: శ్రీశైలంలో టికెట్ల కుంభకోణంపై కొనసాగుతున్న విచారణ..