కర్నూలు జిల్లాలో..
- ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడిన ఓ కానిస్టేబుల్.. ఘటనాస్థలంలోనే మృతి చెందారు. కర్నూలులో మూడవ పట్టణ పోలీసు స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ జనార్థన్ విధులు ముగించుకొని సొంత ఊరు పసుపులకు బైక్ పై బయలుదేరారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి కిందపడింది. తీవ్రగాాయాలపాలైన ఆయన అక్కడికక్కడే చనిపోయారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
- కర్నూలు సమీపంలోని నన్నూరు టోల్ గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమదంలో తల్లీ కుమార్తెలు మరణించారు. స్థానిక మారుతి నగర్ కు చెందిన శంకరమ్మ (తల్లి) , దుర్గేశ్వరి(కుమార్తె) గిద్దలూరు నుంచి కారులో సొంతూరికి వస్తుండగా.. అదుపు తప్పి వాహనం టోల్ గేటు వద్ద స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈఘటన పై ఓర్వకల్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో...
కొల్లూరు మండలంలో.. విధులకు వెళ్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మేరీ గ్రెస్ (45) అనే ఎఎన్ఎం.. ఈపూరు లంక గ్రామంలో కరోన టెస్టులు చేసేందుకు భర్తతో కలిసి బైక్ మీద వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న మట్టి ట్రాక్టర్ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏఎన్ఎం ట్రాక్టర్ వెనుక చక్రం కింద పడడంతో తల పగిలి మృతి చెందారు. ఆమె భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
శ్రీకాకుళం జిల్లాలో...