ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అతివేగంతో అదుపు తప్పిన వాహనాలు.. ఇద్దరు మృతి - కర్నూలు రోడ్డు ప్రమాదం

వాహనాలను అతివేగంగా నడపవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా.. కొందరు వ్యక్తలు వీటిని లెక్క చేయకుండా తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఇలాగే.. అతి వేగం కారణంగా ఇద్దరు వాహనదారులు తమ ప్రాణాలను కొల్పోయారు.

road accident
రోడ్డు ప్రమాదం

By

Published : Jun 10, 2021, 11:35 AM IST

కర్నూలులో బైకుపై వెళ్తున్న వ్యక్తి.. రోడ్డు డివైడర్ ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక గడ్డా వీధికి చెందిన రమేశ్.. కురగాయల వ్యాపారం చేసేవాడు. వీటిని తీసుకురావటం కోసం అతని కుమారుడు నరసింహ ద్విచక్ర వాహనంపై వెళ్తు బంగారు పేట వద్ద అదుపు తప్పి ఢివైడర్ ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో నరసింహ అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ఘటనలో..

కృష్ణా జిల్లా నందిగామ - మధిర రోడ్డులో మాగల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన కొత్తపల్లి వెంకటేశ్వరరావు.. నందిగామ వస్తుండగా స్కూటీ అదుపు తప్పి పడిపోయాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ నాగేశ్వరరావు పరిశీలించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మహిళపై లైంగిక దాడికి యత్నం.. అటుపై కత్తితో దాడి

ABOUT THE AUTHOR

...view details