కరోనా మృతులకు తమ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించవద్దంటూ కర్నూలు శివారు సుంకేశుల రోడ్డు వాసులు ఆందోళన చేపట్టారు. సుంకేసుల రహదారిలోని శ్మశానంలో కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. ఎంతోమంది నివసిస్తున్న ఆ ప్రాంతంలో ఖననాలు చేయటాన్ని తప్పుబట్టారు. తమ ప్రాంతంలో ఈ ప్రక్రియను ఆపకపోతే సహించేది లేదని హెచ్చరించారు.
'వారి అంత్యక్రియలు ఇక్కడ నిర్వహిస్తే సహించం' - కర్నూలు తాజా వార్తలు
కరోనా సోకి మృతి చెందిన వారికి తమ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులోని సుంకేశుల రోడ్డు వాసులు ఆందోళనకు దిగారు. రోడ్డెక్కి నినాదాలు చేశారు.
kurnool