ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తికి రికార్డుస్థాయి ధర...ఎంతంటే..? - కర్నూలు లేటెస్ట్ అప్డేట్స్
Record price for cotton: అదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్ పత్తికి ఏకంగా రూ.11,111ల ధర పలికింది. యార్డు చరిత్రలోనే ఇంత ధర రావడం ఇదే తొలిసారి అని వ్యాపారులు చెబుతున్నారు. దిగుబడి తగ్గడం వల్లే ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.
Record price for cotton: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. బుధవారం 590 క్వింటాళ్ల పత్తిని... రైతులు అమ్మకానికి తెచ్చారు. క్వింటాల్ పత్తికి గరిష్ఠంగా రూ.11,111 ధర పలకగా.. కనిష్ఠంగా రూ.6,769 ధర లభించింది. వ్యవసాయ మార్కెట్ యార్డు చరిత్రలోనే ఇది అధికమని వ్యాపారులు చెబుతున్నారు. దిగుబడులు తగ్గడం వల్ల పత్తికి డిమాండ్ ఏర్పడి.. ధరలు పెరిగాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే.. ఆదోని మార్కెట్లోనే అత్యధిక ధరలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం కొన్ని పత్తి లాట్లకు మాత్రమే అత్యధిక ధరలు వేసి... మిగతా వాటికి తక్కువ ధరలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:ఎరిగేరిలో ఘోర విషాదం... లేత జొన్న గడ్డి తిని 14 ఆవులు, 2 గేదెలు మృతి