ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం, కంది పప్పు తీసుకునేందుకు కర్నూల్లో ప్రజలు బారులు తీరారు. మూడు రోజుల నుంచి సర్వర్ మొరాయించడంతో స్పందించిన ప్రభుత్వం.. నేటి నుంచి మ్యానువల్‌గా ప్రజలకు సరకులు అందిస్తున్నారు. నగరంలోని కొన్ని రేషన్ దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ క్యూలైన్లో నిల్చున్నారు. కొన్ని దుకాణాల్లో మనుషులకు బదులు వస్తువులను లైన్ లో పెట్టి తమ సమయం వచ్చినప్పుడు వారు వెళ్లి సరుకులు తీసుకుంటున్నారు. గుంపులుగా ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
రేషన్ దుకాణాల వద్ద బారులు తీరిన జనం
కర్నూలులో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. నేటి నుంచి మ్యానువల్‌గా సరకులిస్తున్నారు. గుంపులుగా ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
రేషన్ దుకాణాల వద్ద బారులు తీరిన జనం