Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. ఇవాళ కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. హాలహర్వి బస్టాండ్ వద్ద ఉన్న రామాలయం నుంచి ఉదయం 7 గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. ఆలూరు సమీపంలోని హత్తిబెలగళ్ వద్ద ముగించారు. హత్తిబెలగళ్ చేరుకున్న రాహుల్ విరామం తీసుకుంటున్నారు. సాయంత్రం తిరిగి ప్రారంభం కానుంది. సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి మునికుర్తి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ సమావేశం నిర్వహిస్తారు. ఇవాళ రాత్రి ఆదోని మండలం చాగి గ్రామంలో రాహుల్ బస చేస్తారు. రాహుల్ జోడో పాదయాత్ర రాష్ట్రంలో ఈనెల 21 వరకు కొనసాగనుంది.
Bharat Jodo Yatra: కర్నూలు జిల్లాలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర - ఏపీ తాజా వార్తలు
Bharat Jodo Yatra: ఇవాళ కర్నూలు జిల్లాలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది. ఉదయం 7 గంటలకు హాలహర్విలో ప్రారంభమైన రాహుల్ యాత్ర... హత్తిబెలగళ్ వద్ద ముగిసింది. సాయంత్రం తిరిగి హత్తిబెలగళ్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది.
రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర
Last Updated : Oct 18, 2022, 10:11 AM IST