ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విధానాన్ని కొనసాగించాలి' - కర్నూలులో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కోసం ధర్నా

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ.. కర్నూలులో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే ప్రక్రియను ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు.

protest in kurnool
కర్నూలులో ఆందోళన

By

Published : Dec 14, 2020, 5:15 PM IST

పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్య కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విధానాన్ని కొనసాగించాలని.. కర్నూలులో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం కోర్టు తీర్పును గౌరవించి ఈ పాఠశాలలను కొనసాగించాలని వారు కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుకోలేని విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంతగానో ఉపయెగపడేవని.. అలాంటి వాటిని ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details