లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలు కడుపు నింపుకోవడానికి అవస్థలు పడుతున్నాయి. దాతలు ఇచ్చే ఆహారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. చిన్నారులైతే ఆకలిని తట్టుకోలేక..సాయం చేసే చేతుల కోసం మండుటెండలో రోడ్ల వెంట పరుగులు తీస్తున్నారు. కర్నూలులోని బంగారుపేటకు చెందిన కొందరు పిల్లలు అరటిపండ్ల బండి వద్దకు వెళ్లి చేయి చాచి అభ్యర్థించిన తీరు చూపరులకు కంటనీరు తెప్పించింది.
ఆకలి మంటలు...దాతల కోసం చిన్నారుల ఎదురుచూపులు - కర్నూలులో లాక్డౌన్తో చిన్నారుల ఆకలి
లాక్డౌన్తో నిరుపేదల పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలి తీర్చే దాతల కోసం ఎదురు చూస్తున్నారు. కర్నూలులోని బంగారుపేటలో అరటిపండ్ల బండి వద్దకు వెళ్లి అభ్యర్థించిన చిన్నారులను చూస్తే.. మనసు చలించక తప్పదు.
కర్నూలులో నిరుపేద చిన్నారుల బాధలు