ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కన్నతండ్రే అపహరించాడు.. ఆ కేసులో మలుపులెన్నో! - kidnap

సినిమా కథకు ఏ మాత్రం తీసిపోని ఓ కేసును కర్నూలు పోలీసులు ఛేదించారు. చిన్నారి అపహరణ కేసులో దర్యాప్తు జరిపితే విస్తుతపోయే నిజాలు బయటకు వచ్చాయి.

పోలీసులు

By

Published : Jul 24, 2019, 6:24 AM IST

Updated : Jul 24, 2019, 9:57 AM IST

తన కుమారుడిని గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారని కర్నూలుకు చెందిన వ్యక్తి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు దర్యాప్తు చేయగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. కర్నూలు నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వెంకటాచలం తన 3 నెలల కుమారుడైన సాయిని మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఎత్తుకెళ్లారని రెండో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి విచారణ చేశారు. వారు రోజంతా శ్రమిస్తే అసలు కథ వెలుగులోకి వచ్చింది. 3 నెలల క్రితం వెంకటాచలం భార్య విజయ కుమారి నంద్యాల ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మ నివ్వగా... వెంటనే బిడ్డ చనిపోయింది. అదే ఆసుపత్రిలో నంద్యాలకు చెందిన మరో మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు అప్పటికే బిడ్డలు ఉండటం, పెద్ద వయసులో బిడ్డను కనడం వంటి కారణాలతో మగశిశువును వెంకటాచలం దంపతులకు ఇచ్చేసింది. తమకు కుమారుడు పుట్టాడని బంధువులకు, ఇరుగుపొరుగు వాళ్లందరికీ చెప్పుకున్నారు ఆ భార్యభర్తలు. అయితే చిన్నారి సొంత తల్లిదండ్రులు వెంకటస్వామి పద్మావతి... తమ బిడ్డ తమకు కావాలంటూ వీరిపై ఒత్తిడి తెచ్చారు. చివరకి వెంకటాచలం దంపతులు మగ బిడ్డను వారికి ఇచ్చేశారు. బంధువులను నమ్మించేందుకు తన బిడ్డను ఎవరో ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ బాబా ఫక్రుద్దీన్ తెలిపారు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ
Last Updated : Jul 24, 2019, 9:57 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details