కర్నూలు నగరవ్యాప్తంగా 7లక్షల మందికి తాగునీరు అందిస్తున్నా.. వేసవిలో దాహార్తి తీరట్లేదు. ప్రధాన వనరు సుంకేసుల జలాశయంలో వేసవిలో నిల్వలు పడిపోవటం, వానలు ఆలస్యమవడం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు సామర్థ్యం సరిపడా లేకపోవడం నీటి కేకలకు కారణమవుతోంది. ఇకపై ఇలాంటి సమస్య తలెత్తకుండా నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కార మార్గాన్ని కనుక్కున్నారు. సుంకేసుల నుంచి ఎస్ఎస్ ట్యాంక్ వరకూ పైప్‌లైన్ వేయాలని నిర్ణయించారు. అందుకు ప్రభుత్వమూ ఆమోదం తెలిపింది.
నీరు వృథా అరికట్టేందు..
సుంకేసుల నుంచి 23 కిలోమీటర్ల మేర కాల్వ ద్వారా నీటిని తరలించే క్రమంలో నీటి ఆవిరులు, జలచౌర్యం లాంటి కారణాలతో 60 శాతం నీరు వృథా అవుతోంది. దీనిని అరికట్టేందుకు సుమారు 82 కోట్లతో పైప్‌లైన్ వేయాలని అధికారులు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంతోపాటు... రాష్ట్ర ప్రభుత్వ, కార్పొరేషన్ నిధులతో ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలని నిర్ణయించారు.