Child on road: కర్నూలు నగరంలో దారుణం జరిగింది. ముడు నెలల పసికందుని (బాలుడు) గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఓ హోటల్ ముందు వదలిపోయారు. రాత్రి సమయంలో అటుగా వెళ్తున వారు బాలుడుని గమనించారు. వెంటనే రెండవ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. బాలుడి వివరాలు తెలియలేదు. వదిలి వెళ్లడానికి కారణాలపై విచారిస్తామని తెలిపారు. రాత్రి సమయం కావడంతో బాలుడిని అశోక్ నగర్లో ఉన్న వసతి గృహంలో ఉంచారు. ఉదయం శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి బాలుడిని అప్పగించారు.
Child: బరువనుకున్నారేమో.! మూడు నెలల పసికందును రోడ్డుపై వదిలి వెళ్లారు - Child
parents left three month old child: సమాజంలో పిల్లలు లెేక తల్లడిల్లిపోయే తల్లిదండ్రులను చూస్తూనే ఉన్నాం. కానీ ఈ పసిగుడ్డును మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై వదిలేసి వెళ్లారు. అటుగా వెళ్తున్న స్థానికులు పిల్లవాడి ఏడ్పును గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ పసికందును శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి అప్పగించారు.
మూడు నెలల పసికందు రోడ్డుపై వదిలేసి వెళ్లారు