రాష్ట్రానికి చెందిన వరిధాన్యం లారీలను.. తెలంగాణలోకి వెళ్లనీయకుండా ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని తెలంగాణ సరిహద్దు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద.. పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
PULLURU TOLL GATE : తెలంగాణలోకి నో-ఎంట్రీ.. భారీగా నిలిచిపోయిన ఏపీ లారీలు! - Paddy loaded lorries stopping at pulluru toll-plaza
పుల్లూరు టోల్ ప్లాజా(Pulluru toll gate) వద్ద తెలంగాణ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చే వరి ధాన్యం లారీలను అడ్డుకున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
![PULLURU TOLL GATE : తెలంగాణలోకి నో-ఎంట్రీ.. భారీగా నిలిచిపోయిన ఏపీ లారీలు! పుల్లూరు టోల్ ప్లాజా వద్దభారీగా నిలిచిపోయిన లారీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13735484-62-13735484-1637852532830.jpg)
పుల్లూరు టోల్ ప్లాజా వద్దభారీగా నిలిచిపోయిన లారీలు
ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ధాన్యానికి తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతి లేదంటూ వెనక్కి పంపిస్తున్నారు. ఈ పరిణామంతో ఏపీకి చెందిన రైతులు ఆవేదన చెందుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా.. ఇలా నడిరోడ్డుపై లారీలను ఆపడం సరికాదని వాపోయారు. పోలీసుల అడ్డగింతతో టోల్గేట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
ఇదీచదవండి.