ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 19, 2020, 9:19 PM IST

ETV Bharat / city

రోజురోజుకూ పెరుగుతున్న ఉల్లి ధర

వర్షాలు పడి ఉల్లి పంట దెబ్బతింది. దీంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో ధర పెరిగిపోయింది. క్వింటా ఉల్లి ధర 6380 రూపాయలు పలుకుతోంది. రెండురోజుల్లో దాదాపు 1500 రూపాయల ధర పెరిగింది.

onions rates hike
onions rates hike

కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నేడు ఉల్లి క్వింటా ధర 6,380 రుపాయలు పలుకగా.. కనిష్టంగా 550 ఉల్లి అమ్మడుపోయింది. 2303 క్వింటాలు ఉల్లి సరుకురాగా మోడల్ ధర రూ. 3700 పలికింది. శనివారం గరిష్టంగా రూ. 4850 ఉల్లి అమ్ముడుపోగా.. సోమవారం రూ. 6380 పలికింది.

రెండురోజుల్లో దాదాపు 1500 రుపాయలు ధర పెరిగింది. జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురవడంతో ఉల్లి పంట దెబ్బతింది. సరుకు మార్కెట్​కు తక్కువగా వస్తున్న కారణంగా.. ధర అమాంతం పెరగుతోంది.

ABOUT THE AUTHOR

...view details