ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తగ్గుతున్న ఉల్లి ధరలు.. సామాన్యులకు ఊరట - తగ్గుతున్న ఉల్లి ధరలు వార్తలు

గత పదిహేను రోజులుగా సామాన్యులను బెంబేలెత్తిస్తున్న ఉల్లి ధరలు... క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కర్నూలు మార్కెట్​లో నిన్నటివరకు 13 వేలు పలికిన క్వింటా ఉల్లి నేడు 9 వేలకు తగ్గింది.

onion rates low kurnool market
తగ్గుతున్న ఉల్లి ధరలు.. సామాన్యులకు ఊరట

By

Published : Dec 8, 2019, 1:02 PM IST

తగ్గుతున్న ఉల్లి ధరలు.. సామాన్యులకు ఊరట

గత పదిహేను రోజులుగా అధికంగా ఉన్న ఉల్లి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. కర్నూలు ఉల్లిపాయల మార్కెట్​లో క్వింటా ఉల్లి 9 వేల రూపాయలు పలుకుతోంది. మహారాష్ట్రలో ధరలు తగ్గడం.. రాష్ట్రంలో ఉల్లి దిగుబడులు క్రమంగా పెరుగుతున్న పరిస్థితుల్లో... మార్కెట్లకు సరుకు పోటెత్తుతోంది. 2 రోజుల క్రితం షోలాపూర్ మార్కెట్​లో... క్వింటా ఉల్లి 20 వేలు పలకగా.. ప్రస్తుతం 10 వేలకు పడిపోయింది. మన రాష్ట్రంలో అన్ని రైతుబజార్లకూ ఉల్లిని సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. కర్నూలు, తాడేపల్లిగూడెం, షోలాపూర్, లాసేల్గావ్ మార్కెట్లలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉల్లిని కొనుగోలు చేస్తున్నామని చెబుతున్న మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ చౌదరితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details